100 కిలోల గంజాయి స్వాధీనం | 100 kg of marijuana seized | Sakshi
Sakshi News home page

100 కిలోల గంజాయి స్వాధీనం

Apr 27 2016 3:58 PM | Updated on Sep 3 2017 10:53 PM

నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం ముద్దలి గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు.

నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం ముద్దలి గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. గూడ్స్ వ్యానులో నజీరుద్దీన్, హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని తరలిస్తుండగా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 

వారు చెప్పిన సమాచారం మేరకు బిచ్చుంద మండలం పెద్దకొడపుగల్ గ్రామం నుంచి గంజాయి తరలిస్తున్నట్టు తేలింది. ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు 134 మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బగీరథ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement