అంతర్జాతీయంగా లాజిస్టిక్ బ్రాండ్ డెలివరీ సేవలు అందిస్తున్న విశిష్ట సంస్థ 'గరుడ వేగాస్' దసరా దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
అంతర్జాతీయంగా లాజిస్టిక్ బ్రాండ్ డెలివరీ సేవలు అందిస్తున్న విశిష్ట సంస్థ 'గరుడ వేగాస్' దసరా దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. తమ వినియోగదారులకోసం గొప్ప ఆఫర్ తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న తమ వారికి ఇష్టమైన వస్తువులను పంపించేందుకు అనువైన డెలివరీ చార్జీలను ప్రకటించింది. అమెరికాకు ఏదైనా పంపించాలనుకున్న వారు ఒక కేజీకి రూ.350 చెల్లిస్తే సరిపోతుందని, భద్రంగా దానిని డెలివరీ చేస్తామని ప్రకటించింది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా 41 నగరాల్లో100 బ్రాంచులతో, ఇతర దేశాల్లో కూడా డెలివరీ సర్వీసులను అందిస్తున్న గరుడ వేగాస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా తన సేవలు మరింత విస్తృతం చేయనుంది. ఇందులో భాగంగా పచ్చళ్ల డెలివరీ సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతోపాటు ఇదే సంస్థకు చెందిన గరుడా బజార్ ద్వారా అక్కడి నుంచి బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేయనుంది. ముఖ్యంగా ఈ దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే డెలీవరి సర్వీసులను అందించనుంది.