breaking news
Garuda Bazaar
-
గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు
పనాజి : అంతర్జాతీయ లాజిస్టిక్ సర్వీసులను అందిస్తున్న గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గోవాలో జరిగిన డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఈవెంట్లో తమకు గోల్డ్ పార్టనర్ అవార్డు దక్కినట్టు కంపెనీ తెలిపింది. ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని పేర్కొంది. ఈ అవార్డును డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియా సీనియర్ మేనేజ్మెంట్ టీమ్, ఎస్వీపీ అండ్ కంట్రీ మేనేజర్(ఇండియా) ఆర్ఎస్ సుబ్రహ్మణియన్, వైస్ ప్రెసిడెంట్(కమర్షియల్) సందీప్ జునేజాలు ఈ అవార్డుతో సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా గరుడవేగ తన సర్వీసులను అందజేస్తుంది. అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ, మధ్య ప్రాచ్యతో పాటు 200 ఇతర దేశాల్లో గరుడవేగ నమ్మకమైన సర్వీసు ప్రొవైడర్‌గా ఉందని కంపెనీ తెలిపింది. తమ పాపులర్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు ద్వారా ప్రస్తుతం అమెరికాకు ఎకానమీ షిప్పింగ్‌ను కేజీకి రూ.350కే అందజేస్తున్నట్టు గరుడవేగ పేర్కొంది. ఐదు పని దినాల్లోనే డెలివరీని చేస్తున్నట్టు కూడా చెప్పింది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు, పండుగ సమయాల్లో తమ కుటుంబాలతో గడిపే సమయాన్ని మిస్ అయితే, వారికి పండుగ సందర్భంగా స్వదేశం నుంచి కానుకలను, మిఠాయిలను పంపించుకునే సౌకర్యాలను కూడా అందిస్తోంది. గరుడబజార్ ద్వారా బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేస్తోంది. దక్షిణా భారత దేశంలో పలు ప్రముఖ వర్తకుల వద్ద స్పెషల్ స్వీట్లను, స్నాక్‌లను అందుబాటులో ఉంచింది. గ్రాండ్ స్వీట్స్, శ్రీకృష్ణ, అద్యార్ ఆనంద భవన్, స్వగృహ, పుల్లా రెడ్డి, వెల్లంకి, శ్రీదేవి వంటి ప్రముఖ వర్తకుల నుంచి వీటిని అందరజేస్తోంది. -
గరుడ వేగాస్ లో దసరా ఆఫర్లు
అంతర్జాతీయంగా లాజిస్టిక్ బ్రాండ్ డెలివరీ సేవలు అందిస్తున్న విశిష్ట సంస్థ 'గరుడ వేగాస్' దసరా దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. తమ వినియోగదారులకోసం గొప్ప ఆఫర్ తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న తమ వారికి ఇష్టమైన వస్తువులను పంపించేందుకు అనువైన డెలివరీ చార్జీలను ప్రకటించింది. అమెరికాకు ఏదైనా పంపించాలనుకున్న వారు ఒక కేజీకి రూ.350 చెల్లిస్తే సరిపోతుందని, భద్రంగా దానిని డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 41 నగరాల్లో100 బ్రాంచులతో, ఇతర దేశాల్లో కూడా డెలివరీ సర్వీసులను అందిస్తున్న గరుడ వేగాస్ ఇప్పుడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా తన సేవలు మరింత విస్తృతం చేయనుంది. ఇందులో భాగంగా పచ్చళ్ల డెలివరీ సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతోపాటు ఇదే సంస్థకు చెందిన గరుడా బజార్ ద్వారా అక్కడి నుంచి బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేయనుంది. ముఖ్యంగా ఈ దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే డెలీవరి సర్వీసులను అందించనుంది.