గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు | GarudaVega Awarded As Gold Partner By DHL | Sakshi
Sakshi News home page

గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు

May 17 2018 4:33 PM | Updated on May 17 2018 8:08 PM

GarudaVega Awarded As Gold Partner By DHL - Sakshi

గరుడవేగకు గోల్డ్‌ పార్టనర్‌ అవార్డు

పనాజి : అంతర్జాతీయ లాజిస్టిక్ సర్వీసులను అందిస్తున్న గరుడవేగకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గోవాలో జరిగిన డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈవెంట్‌లో తమకు గోల్డ్‌ పార్టనర్‌ అవార్డు దక్కినట్టు కంపెనీ తెలిపింది. ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని పేర్కొంది. ఈ అవార్డును డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇండియా సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌, ఎస్‌వీపీ అండ్‌ కంట్రీ మేనేజర్‌(ఇండియా) ఆర్‌ఎస్‌ సుబ్రహ్మణియన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌(కమర్షియల్‌) సందీప్‌ జునేజాలు ఈ అవార్డుతో సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా గరుడవేగ తన సర్వీసులను అందజేస్తుంది. అమెరికా, యూకే, యూరప్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూఏఈ, మధ్య ప్రాచ్యతో పాటు 200 ఇతర దేశాల్లో గరుడవేగ నమ్మకమైన సర్వీసు ప్రొవైడర్‌గా ఉందని కంపెనీ తెలిపింది.

తమ పాపులర్‌ ఎ​క్స్‌ప్రెస్‌ సర్వీసు ద్వారా ప్రస్తుతం అమెరికాకు ఎకానమీ షిప్పింగ్‌ను కేజీకి రూ.350కే అందజేస్తున్నట్టు గరుడవేగ పేర్కొంది. ఐదు పని దినాల్లోనే డెలివరీని చేస్తున్నట్టు కూడా చెప్పింది.  విదేశాల్లో ఉంటున్న భారతీయులు, పండుగ సమయాల్లో తమ కుటుంబాలతో గడిపే సమయాన్ని మిస్‌ అయితే, వారికి పండుగ సందర్భంగా స్వదేశం నుంచి కానుకలను, మిఠాయిలను పంపించుకునే సౌకర్యాలను కూడా అందిస్తోంది. గరుడబజార్ ద్వారా బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేస్తోంది. దక్షిణా భారత దేశంలో పలు ప్రముఖ వర్తకుల వద్ద స్పెషల్‌ స్వీట్లను, స్నాక్‌లను అందుబాటులో ఉంచింది. గ్రాండ్‌ స్వీట్స్‌, శ్రీకృష్ణ, అద్యార్‌ ఆనంద భవన్‌, స్వగృహ, పుల్లా రెడ్డి, వెల్లంకి, శ్రీదేవి వంటి ప్రముఖ వర్తకుల నుంచి వీటిని అందరజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement