
ఆటాలో కొలువుదీరిన బతుకమ్మ
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోగల చికాగోలో అట్టహాసంగా ప్రారంభమైన ఆటా వేడుకల్లో తెలంగాణ బతుకమ్మ కొలువు దీరింది.
చికాగో: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోగల చికాగోలో అట్టహాసంగా ప్రారంభమైన ఆటా వేడుకల్లో రెండో రోజు తెలంగాణ బతుకమ్మ కొలువు దీరింది. పలువురు తెలంగాణ ఎన్నారై మహిళలు రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలతో తరలివచ్చారు. అమ్మవారి ప్రతిమతోపాటు, త్రిశూలాలు, ఇతర పూజా సామాగ్రి.. అచ్చం తెలంగాణ సంస్కృతి కొలువుదీరినట్లు కనిపించింది.
ఈ కార్యక్రమం లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగింది. కవిత ఆటా ఉత్సవాల నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నాపెద్దా అంతా ఈ వేడుకల్లో పాలుపంచుకోగా పలువురు తమ సెల్ ఫోన్లలో ఈ కార్యక్రమాన్ని బందించారు. బతుకమ్మ తరలి వస్తుంటే పలువురు ఆనందంతో నృత్యం చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుక నిర్వాహకురాలు కవితతో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు పోటీలు పడ్డారు.