'అటా' ఆధ్వర్యంలో 5కే రన్ | Sakshi
Sakshi News home page

'అటా' ఆధ్వర్యంలో 5కే రన్

Published Sat, Dec 5 2015 10:16 PM

ata programs in india

హైదరాబాద్: వచ్చే ఏడాది జూలై 1 నుంచి చికాగోలో అటా(అమెరికన్ తెలుగు అసోసియేషన్) రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో తెలురాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలకు 'అటా' శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ సెంట్రల్ కోర్టు హోటల్ లో జరిగిన సమావేశంలో 'అటా' అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..ఈ నెల 7 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అటా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. 19న 'హైదరాబాద్ అటా రేస్' పేరుతో నెక్లెస్ రోడ్‌లో 5కే రన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం ఈ నెల 20న  శిల్పారామంలో గ్రాండ్ ఫినాలె ఉంటుందని చెప్పారు. ఫినాలెలో వివిధ రంగాల్లో స్ఫూర్తి ప్రదాతలను ఎంపిక చేసి ఘనంగా సన్మానిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ నెల 19 జరిగే సంగీత, నృత్య పోటీల్లో విజేతలను అమెరికాలో అటా రజతోత్సవ వేడుకలకు తీసుకెళ్లి సన్మానించనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement