నల్లగొండ జిల్లా దురాజ్ పల్లిలో లింగమంతుల జాతర ఘనంగా జరుగుతోంది.
నల్లగొండ: నల్లగొండ జిల్లా దురాజ్ పల్లిలో లింగమంతుల జాతర ఘనంగా జరుగుతోంది. సోమవారం ఉదయం వేలాది మంది భక్తులు అక్కడికి తరలి వచ్చారు. భక్తుల తాకిడికి ట్రాఫిక్ స్తంభించిపోయింది. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కోదాడ, మిర్యాల గూడ, నల్లగొండ మీదుగా హైదరాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నార్కట్ పల్లి, నల్లగొండ మీదుగా విజయవాడకు మళ్లించినట్టు సమాచారం.


