ప్రేమ విఫలం కావడంతో.. | Young Man Commits Suicide On Railway Track Kurnool | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

May 25 2018 11:51 AM | Updated on Nov 6 2018 8:16 PM

Young Man Commits Suicide On Railway Track Kurnool - Sakshi

కిశోర్‌ గౌడ్‌

సాక్షి, కర్నూలు(డోన్‌): ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. కొండపేటకు చెందిన కృష్ణమూర్తి గౌడ్‌(లేట్‌), లలిత దంపతుల కుమారుడు కిశోర్‌ గౌడ్‌ (22) ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పూర్తిచేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇటీవల పట్టణానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయి కిశోర్‌ ప్రేమను తిరస్కరించింది. దీంతో తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ఖాదర్‌బాషా తెలిపారు. కుమారుడి మృతితో తల్లి కన్నీరుమున్నీరైంది.

Advertisement
 
Advertisement
Advertisement