అల్యూమినియంలో దాగారు.. ఎక్స్‌-రేకు చిక్కారు.. | X-ray Machine Caught 7 People Sneaking Into Turkey | Sakshi
Sakshi News home page

అల్యూమినియంలో దాగారు.. ఎక్స్‌-రేకు చిక్కారు..

Jun 8 2018 7:19 PM | Updated on Jun 8 2018 7:24 PM

X-ray Machine Caught 7 People Sneaking Into Turkey - Sakshi

ఇస్తాంబుల్‌ : కంటైనర్ల ద్వారా అక్రమంగా టర్కీలోకి ప్రవేశించాలని చూసిన ఏడుగురిని ఎక్స్‌ రే మిషన్‌ పట్టించింది. ఇరాక్‌ చెందిన ఏడుగురు టర్కీలోకి అక్రమంగా ప్రవేశించాలని చేసిన యత్నం మాత్రం ఆసక్తికరంగా ఉంది. అధికారులు గుర్తించకుండా ఉండేందుకు ఏడుగురు అ‍ల్యూమినియం షీట్లను తమ శరీరాలకు చుట్టుకున్నారు.

అనుకున్నట్లే అధికారులు వారిని గుర్తించలేకపోయారు. అయితే, సరిహద్దులో ఎక్స్‌ రే మిషన్‌ చేసిన స్కాన్‌లో వీరి బండారం బయటపడింది. షీట్లలో ఏడుగురు వ్యక్తులు ఉన్నట్లు ఎక్స్‌ రే స్కాన్‌ను చూసిన అధికారులు తెలుసుకున్నారు. వెంటనే కంటైనర్‌ను తెరచి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement