వివాహితపై ఐదు రోజులపాటు అఘాయిత్యం

Women Kept Hosted And Molested For Five days In Uttar Pradesh - Sakshi

లక్నో : వివాహితను గదిలో బంధించి అయిదురోజుల పాటు అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. నెల 19న జరిగిన ఈ ఘటన గురించి శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు. బడోహి జిల్లాలోని నివసిస్తున్న ఓ మహిళకు(18) మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. అయిదు రోజుల క్రితం మహిళ తన అత్తగారి ఇంట్లో ఉందని తెలుసుకున్న ఓ వ్యక్తి అక్కడకి వచ్చి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు. ఆనంతరం ఆమెను గదిలో బంధించి బలవంతంగా అయిదు రోజులు అత్యాచారానికి తెగబడ్డాడు. బుధవారం కోడలి తల్లి ఆరోగ్య క్షేమాలు తెలుసుకోడానికి అత్తమామలు మహిళ పుట్టింటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది.

తన కూతురు అసలు ఇంటికి రాలేదని తల్లి చెప్పడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని విశాల్‌ సరోజ్‌గా గుర్తించారు. సరోజ్‌ బాధితురాలి గ్రామానికే చెందినవాడని పోలీసులు తెలిపారు. గురువారం సరోజ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రం మధ్యలోని గదిలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పోలీసులు రక్షించారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సరోజ్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top