బాలికపై లైంగికదాడి | Women harassed By A Man In Nidadavolu | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి

Jul 25 2019 3:04 PM | Updated on Jul 25 2019 3:04 PM

Women harassed By A Man In Nidadavolu - Sakshi

సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పిన వివాహితుడు ఆమెపై రెండు రోజులపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికను నమ్మిం చేందుకు ఆమె మెడలో తాళికట్టి లొంగదీసుకున్నాడు. పట్టణ ఎస్సై కె.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చర్చిపేటకు చెందిన ఓ బాలిక (17)పై మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన ముప్పిడి రాజశేఖర్‌ అనే వివాహితుడు రెండు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చర్చిపేటలో నివాసముంటున్న కోప పాప అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆమె మూడో కుమార్తె కోయ లక్ష్మి ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉండగా తన కుమార్తె (మైనర్‌ బాలిక)ను కోయ పాప వద్ద ఉంచింది. ప్రస్తుతం ఈ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈనేపథ్యంలో ఈనెల 21న రాత్రి 1 గంట సమయంలో బాలిక కనిపించకపోవడంతో బంధువులు ఊరంతా గాలించినా ఫలితం లేకపోవడంతో అమ్మమ్మ కోయ పాప 23న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్సై కె.ప్రసాద్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక బంధువులను విచారించగా గోపవరం గ్రామానికి చెందిన ముప్పిడి రాజశేఖర్‌పై అనుమానం వచ్చి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్‌ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. ఈనెల 21న రాత్రి రాజశేఖర్‌ చర్చిపేట వచ్చి బాలికను రాజమండ్రి తీసుకువెళ్లాడని, మార్గమధ్యలో ఓ ఆలయం వద్ద ఆమె మెడలో పసుపు తాడు కట్టాడని నిర్ధారించుకున్నారు. నిందితుడు రాజ మండ్రిలో ఓ లాడ్జికి తీసుకువెళ్లి బాలికపై రెండు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడినట్టు తెలుసుకున్నారు. బాలిక ఆచూకీ తెలుసుకుని ఆమెను వైద్య పరీక్షల కోసం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌చేశారు. అతడికి భార్య, బిడ్డ ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement