నన్ను 43 వేల సార్లు రేప్‌ చేశారు

Woman 'raped 43,200' times speaks out about Mexico's human trafficking rings

మెక్సికో సిటీ : కార్లా జాసింటో మెక్సికో దేశానికి చెందిన ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. మానవ అక్రమ రవాణా ముఠా బారిన పడిన కార్లా తాను అనుభవించిన నరకయాతనను ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించింది. 43,200 సార్లు తాను రేప్‌కు గురయ్యానని చెప్పింది. నాలుగు సంవత్సరాల పాటు ప్రతి రోజూ 30 మంది తనను రేప్‌ చేశారని, ఆ దారుణాన్ని తలుచుకుంటే ఇప్పటికి తనకు వణుకు వస్తుందని తెలిపింది.

కార్లా.. 12 ఏళ్ల వయసులో ఓ హ్యుమన్‌ ట్రాఫికర్‌ పట్ల ఆకర్షితురాలైంది. గిఫ్ట్‌లు, డబ్బు, ఫాస్ట్‌ కార్ల మోజులో పడి అతన్ని నమ్మింది. ఓ రోజు కార్లాను కలిసిన అతడు తనతో పాటు వచ్చేయమని అడిగాడు. అలా బయటకు వెళ్లిన కార్లా.. మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కింది.

ఆ తర్వాత కార్లాను ముఠాలోని సభ్యలు బలవంతంగా వేశ్యగా మార్చారు. ఉదయం పది గంటల నుంచి అర్థరాత్రి వరకూ విటులు వచ్చేవారని కార్లా తెలిపింది. బాధను తట్టుకోలేక తాను ఏడుస్తుంటే విటులు బిగ్గరగా నవ్వేవారని చెప్పింది. ఆ బాధను భరించలేక కళ్లు మూసుకునే దాన్నని, దాంతో ఏం జరుగుతుందో తనకు తెలిసే కాదని చెప్పుకొచ్చింది.

ఓ రోజు తన మెడపై పెదవుల గుర్తులు ఉండటాన్ని చూసిన ఓ విటుడు.. విచక్షణా రహితంగా ఇనుప గొలుసులతో తనను కొట్టాడని కన్నీరు పెట్టుకుంది. పిడిగుద్దులు గుద్దాడని, జుట్టు పట్టుకుని పైకి లేపి ముఖం మీద ఉమ్మాడని చెప్పింది. ఆ తర్వాత ఇనుప చువ్వను కాల్చి వాతలు పెట్టాడని తెలిపింది.

2006లో పోలీసులు జరిపిన రైడింగ్‌ కార్లా పాలిట వరంగా మారింది. ఆ రైడింగ్‌లో ట్రాఫికర్స్‌ నుంచి తప్పించుకున్న కార్లా ప్రస్తుతం లాయర్‌ అయ్యారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోర్టుల్లో వాదిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top