12 గంటల్లో.. వీడిన మిస్టరీ  

Woman Murder Mystery Revealed In Berhampur - Sakshi

బరంపురం : నగర శివారు హల్దియాపదర్‌ ప్రాంతంలోని రళబ గ్రామ పోలిమేరల్లో మంగళవారం పోలీసులు గుర్తించిన మహిళ సంజూ బెహరా హత్య కేసుకు సబంధించిన నిందితుని 12 గంటలు తిరక్కుండానే హత్య కేసును ఛేదించి నిందితుని అరెస్ట్‌ చేసి విజయం సాధించినట్లు బరంపురం ఎస్‌పీ పినాకి మిశ్రా చెప్పారు.  బరంపురం ఎస్‌పీ కార్యాలయంలో బరంపురం పోలీసు జిల్లా ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ పినాకి మిశ్రా మాట్లాడుతూ గోళంతరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల హల్దియాపదర్, రళవ కేవుటి వీధికి చెందిన 40 ఏళ్ల మహిళ సంజూ బెహరా మృతదేహాన్ని పోలీసులు మంగళవారం కనుగొన్నట్లు చెప్పారు. మహిళా సంజూ బెహరా హత్య కేసుపై ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు అధారంగా ప్రత్యేకపోలీసు బృందంగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. సంజు బెహరా హత్య జరిగిన సంఘటనా స్థలంలో  నిందితుని మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగించగా పలు నిజాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. 

నిందితుడితో వివాహేతర సంబంధం
హల్దియాపదర్, రళవ కేవుటి వీధికి చెందిన 40 ఏళ్ల సంజూ బెహరా బరంపురం గేట్‌ బజార్‌ చేపల మార్కెట్‌లో చేపల వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. ఇదే గేట్‌ బజార్‌లో చేపల మార్కెట్‌ దగ్గర టున్నా డకువా అనే యువకుడు సెలూన్‌ షాప్‌ నడుపుతున్నాడు. వీరిద్దరి మధ్య గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుసుకున్నామన్నారు.  అయితే సంజుబెహరా వివిధ ప్రేమ వ్యవహారాలు కలిగి ఉన్నట్లు టున్నా డకువా అనుమానించేవాడు. ఈ నేపథ్యంలో 17వ తేదీ రాత్రి హల్దియాపదర్‌ ప్రాంతంలోని రళబ దగ్గరకి టున్నా బెహరా వెళ్లి సంజు బెహరాను ఫోన్‌ చేసి పిలిచాడు. ఇద్దరు సైకిల్‌పై రళబ పోలిమేర శివారు ఆశ్రమం వెనుకకు వెళ్లి  వారితో పాటు తీసుకువెళ్లిన బీరు బాటిల్స్‌ తాగారు. 

బీరు బాటిల్స్‌ పగలగొట్టి హత్య
అనంతరం సంజు బెహరా  ప్రేమవ్యవహారాలపై  టున్నా డుక్కువ ప్రశ్నించగా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తాగిన ఖాళీ బీరు బాటిల్స్‌ టున్నా పగుల గొట్టి సంజుబెహరాను పొడిచి హత్య చేశాడు. వారిద్దరి పెనుగులాటలో టున్నా డకువాకి కూడా గాయాలయ్యాయి. ఆ పెనుగులాటలో టున్నా డకువా మొబైల్‌ ఫోన్‌ పడిపోయినట్లు ఎస్పీ చెప్పారు. నిందితుడి మొబైల్‌ఫోన్‌ను పట్టుకుని  దర్యాప్తు చేపట్టగా సంఘటన అంతా వెలుగులోకి   వచ్చిందని ఎస్‌పీ       

పినాకి మిశ్రా వివరించారు. స్వల్ప గాయాలైన  టున్నా డకువా సిటీ అస్పత్రికి వెళ్లి చికిత్సలు చేయించుకుని   ఏమీ ఎరగనట్లు ఉన్నాడు. దర్యాప్తు అనంతరం నిందితుడు టున్నా డకువాని అతని నివాసంలో బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌పీ వివరించారు. హత్యకు వాడిన పలిగిన బీరు బాటిల్‌ గాజు ముక్కలు, సంఘటనా స్థలంలో రక్తపు నమూనా మట్టి అనవాళ్లు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పీ పినాకి మిశ్రా తెలియజేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top