ట్రిపుల్‌ తలాక్‌: ఆ వెంటనే మామ గ్యాంగ్‌రేప్‌

Woman After Triple Talaq Raped By Father In Law In Rajasthan - Sakshi

ట్రిపుల్‌ తలాక్‌తో మామలో మేల్కొన్న మృగం

జైపూర్‌: రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. మామ, భర్త సోదరుడితో కలిసి కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అల్వార్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రాజస్ధాన్‌ ఆల్వార్‌కు చెందిన మహిళ(25)కు తన భర్త ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన అనంతరం.. బాధితురాలి మామ(భర్త తండ్రి)లోని మృగాడు బయటికి వచ్చాడు. కొడుకు  విడాకులు చెప్పిన మరుక్షణమే తమ్ముడితో కలిసి కొడలిపై లైంగిక దాడికి పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు ఆ ఉన్మాది. 

మరుసటి రోజు పుట్టింటికి వెళ్లిన బాధితురాలు తండ్రికి జరిగిన ఘటన గురించి చేప్పింది. తండ్రితో కలిసి బాధిత మహిళ సోమవారం భివాండి మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  మహిళకు గత శుక్రవారం తన భర్త ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన కొద్ది గంటలకే.. అతని అన్న తనపై దాడి చేశాడని, అంతేకాక తన మామయ్యతో పాటు అతని తమ్ముడు లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం కింద కేసు నమోదు చేసుకుని అమెను వైద్య పరీక్షలు నిమత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళ ఫిర్యాదుతో  ట్రిపుల్ తలాక్, అత్యాచారం కేసు కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని, ప్రస్తుతం బాధితురాలిని వైద్యపరీక్షల కోసం హస్సీటల్‌కు పంపించామని పోలీసులు తెలిపారు.

అయితే ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్‌ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్‌’ను చెప్పడం అక్రమం. దీనిని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్‌ నంబర్‌ 20 ఆఫ్‌ 2019) చాప్టర్‌–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్‌’ పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top