
భర్త నరేష్‌తో జయలక్ష్మి(ఫైల్)
అనంతపురం, బుక్కపట్నం: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. గర్భిణి అనే కనికరం కూడా లేకుండా ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బుక్కపట్నం ఎస్సీ కాలనీకి చెందిన నిండు గర్భిణి జయలక్ష్మి (23) డిసెంబర్ 25న నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని భర్త నరేష్‌కుమార్ అనంతపురం ఆస్పత్రిలో చేర్చాడు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. తన భర్త నిత్యం వేధించేవాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని, అనుమానం రాకుండా ఉండేందుకు తానే ఆత్మహత్యకు యత్నించినట్లు నమ్మబలికాడని జయలక్ష్మి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కిరాతక భర్తను కఠినంగా శిక్షించాలని జయలక్ష్మి బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.