ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆపై

Wife Murdered Husband With Lover In Yadadri Bhuvanagiri District - Sakshi

గ్రామస్తుల ఎదుట లొంగుబాటు

సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. వివరాలు.. మెరుగు కొమరయ్య, మెరుగు కొమరమ్మ దంపతులు అడ్డగూడూరు మండలం మానాయికుంటలో నివాసముంటున్నారు. కడారి ఈదయ్యతో గత కొంతకాలంగా కొమరమ్మ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. నిన్న రాత్రి (బుధవారం) ఈదయ్య, కొమరమ్మలు ఆమె భర్త కొమరయ్యను హత్య చేశారు. అనంతరం చేసిన నేరాన్ని గ్రామస్తుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top