Wife Files Complaint Against Husband In Bangalore for Installing CC Camera in Bedroom - Sakshi
Sakshi News home page

పడక గదిలో కెమెరా.. భార్యపై అనుమానం

Jun 3 2019 9:53 AM | Updated on Jun 3 2019 1:29 PM

Wife Files Cpmplaint Against Husband For Installing CC Camera in Bedroom - Sakshi

సాక్షి, బెంగళూరు: తాళికట్టిన భర్త అమానుష ప్రవర్తనతో విసుగెత్తిన భార్య పోలీసుల్ని ఆశ్రయించింది. అశ్లీల వెబ్‌సైట్లకు బానిసైన ఓ వ్యక్తి పడకగదిలో భార్యతో లైంగిక ప్రక్రియను రికార్డు చేసుకునే ఉద్దేశంతో బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరా అమర్చిన ఘటన కర్ణాటకలోని సదాశివనగరలో వెలుగు చూసింది. భర్త రిత్విక్‌ హెగ్డే వేధింపులు భరించలేక బాధితురాలు.. భర్త, అత‍్తమామలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త రిత్విక్‌ హెగ్డే వివాహం అనంతరం వ్యాపారరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు.

దంపతులకు నాలుగేళ్ల కుమారుడు. అయితే రిత్విక్‌ హెగ్డ్‌ భార్యతో లైంగిక ప్రక్రియ చూడాలనే కోరికతో ఆమెకు తెలియకుండా బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరా అమర్చాడు. మరోవైపు భార్య ప్రవర్తనపై అనుమానపడేవాడు. అంతేకాకుండా భార్య ఈ మెయిల్ హ్యాక్‌ చేసి అందులో ఆమె స్నేహితులకు అశ్లీలంగా మెసేజ్‌ పంపించేవాడు. దీంతో ఆమె... భర్త ప్రవర్తనను ప్రశ్నంచడంతో భౌతికంగా దాడి చేయడమే కాకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు. విసుగెత్తిన బాధితురాలు ఆదివారం పోలీసుల్ని ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement