పరాయి పురుషుడితో భార్య పరారీ | Wife Escape With Lover Husband Commits Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

పరాయి పురుషుడితో భార్య పరారీ

Jul 1 2019 8:01 AM | Updated on Jul 1 2019 8:01 AM

Wife Escape With Lover Husband Commits Suicide in Karnataka - Sakshi

కాంతరాజు (ఫైల్‌)

మనస్తాపంతో భర్త ఆత్మహత్య

కర్ణాటక ,దొడ్డబళ్లాపురం : భార్య పరాయి వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా హొసహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. కాంతరాజు (40) పదేళ్ల క్రితం భాగ్యమ్మను వివాహం చేసుకున్నాడు. దంపతులకు 9 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భాగ్యమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కాంతరాజు తరచూ మందలించేవాడు. దీంతో భాగ్యమ్మ పరాయి వ్యక్తితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో కాంతరాజు కలతచెంది తన కష్టం గురించి మొబైల్‌లో వీడియో తీసి చెప్పుకుని స్వంత స్థలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి కుదూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement