బెల్టుతో వాతలు తేలేలా కొట్టి.. ఎస్సై వాసు ఓవరాక్షన్‌! | vijayapuri south SI vasu over action | Sakshi
Sakshi News home page

Feb 11 2018 9:24 AM | Updated on Sep 2 2018 3:51 PM

vijayapuri south SI vasu over action - Sakshi

సాక్షి, గుంటూరు: విజయపురి సౌత్ ఎస్సై వాసు ఓవరాక్షన్‌ కలకలం రేపుతోంది. ఎస్సై వాసు ఓ సివిల్ కేసులో తలదూర్చి ఒక వర్గానికి కొమ్ముకాస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సివిల్‌ కేసుకు సంబంధించి మట్టపల్లి శ్రీనివాసరావు అనే యువకుడిని పోలీసు స్టేషన్‌కు పిలిచి ఎస్సై బెల్టుతో చితకబాదాడు. దీంతో శ్రీనివాసరావుకు ఒళ్లంతా వాతాలు తేలాయి. ఈ నొప్పుల బాధ, అవమానం తట్టుకోలేక అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితుడిని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement