వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు గొడవ | Vasavi College of Engineering Students Fight Cricket Betting Money | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ సొమ్ముల కోసం గొడవ

Oct 2 2019 10:25 AM | Updated on Oct 2 2019 10:36 AM

Vasavi College of Engineering Students Fight Cricket Betting Money - Sakshi

పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెంరూరల్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ సొమ్ముల కోసం విద్యార్థులు గొడవ పడిన సంఘటన మండలంలోని పెదతాడేపల్లిలోని ఒక ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగింది. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్‌ బెట్టింగ్‌ జరిగింది. వడ్లూరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ సొమ్ము విషయంలో వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా సొమ్ములు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఆ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలు మంగళవారం వాట్సప్‌లో హల్‌ చల్‌ చేయడంతో విషయం బయటకు పొక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement