‘పాప శరీరంలో దెయ్యం ఉంది’

Uttar Pradesh Family Throws Infant Over Suspicion Of Evil Spirits - Sakshi

లక్నో : శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా.. అంతరిక్షంలోకి వెళ్లినా మన సమాజంలో పాతుకుపోయిన కొన్ని ముఢనమ్మకాలను మాత్రం తొలగించలేకపోతున్నాం. సైన్స్‌ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా భూత వైద్యులను, బాబాలను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే పనికిమాలిన సలహాల ప్రకారం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి సంఘటనే ఒకటి షాజహాన్‌ పూర్‌లో చోటు చేసుకుంది. నెలల పసికందుకు జబ్బు చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాల్సింది పోయి భూతవైద్యున్ని కలిశారు తల్లిదండ్రులు.

అతడు కాస్తా పాప శరీరంలో చెడు ఆత్మ ఉంది. దాని వల్ల మీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని చెప్పాడు. పాపను వదిలించుకోకపోతే ప్రాణ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాడు. దాంతో ఊరి దగ్గర ఉన్న చెరువులో పాపను పడేసేందుకు నిశ్చయించుకున్నాడు కసాయి తండ్రి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ లోపు అక్కడికి చేరుకోవడంతో చిన్నారిని సురక్షితంగా కాపాడారు. అనంతరం పాప తండ్రితో పాటు, మాంత్రికున్ని కూడా అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top