breaking news
tantrik baba
-
50 వేల ఎకరాలు.. డబ్బుల వర్షం కురిపిస్తానంటూ రూ. 94 లక్షలు వసూలు
గాంధీనగర్: కష్టపడితేనే రూపాయి సంపాదించగల్గుతాం. అలాంటిది ఏ పని చేయకుండా.. ఇంట్లోనే కూర్చని కోటీశ్వరులు కావాలనుకోవడం.. నట్టింట్లో డబ్బుల వర్షం కురవాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఇలా కష్టపడకుండా భారీగా డబ్బు సంపాదించాలనుకువారినే టార్గెట్ చేస్తారు కిలేడీలు. మన వీక్నెస్ వారికి ప్లస్ అవుతుంది. కల్లబొల్లి కబుర్లు చెప్పి భారీగా వసూలు చేసి పరారవుతారు. ఆ తర్వాత మనం తేరుకుని లబోదిబమన్న ప్రయోజనం శూన్యం. సరిగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి. నకిలీ తాంత్రికుడు ఒకరు నేను చెప్పినట్లు చేస్తే.. నీపై డబ్బుల వర్షం కురుస్తుంది.. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటావని నమ్మించాడు. సుమారు కోటి రూపాయలు వసూలు చేసి.. ఉడాయించాడు. పదేళ్ల నుంచి ఇలా మాయమాటలు చెప్పి.. భారీగా వసూలు చేశాడు. చివరకు నకిలీ తాంత్రికుడు తన దుకాణం ఎత్తేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ వివరాలు.. గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన మహోరవాలా అనే వ్యక్తికి 2010లో నిందితుడు హితేష్ యాగ్యిక్‌తో పరిచయం ఏర్పడింది. నిందితుడు తనను తాను జునాగఢ్‌కు చెందిన కశ్మీర్ బాపు శిష్యుడిగా పరిచయం చేసుకోవడమేకాక తనకు మంత్రతంత్రాలు, జ్యోతిష్యం తెలుసని మహోరవాలాకు తెలిపాడు. తాను చెప్పిన పూజలు చేస్తే.. మహోరవాలాపై డబ్బుల వర్షం కురుస్తుందని.. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తాడని ఆశపెట్టాడు. నకిలీ తాంత్రికుడి మాటలు నమ్మిన మహోరవాలా అతడు చెప్పినట్లు చేయసాగాడు. ఈ క్రమంలో 2016లో నిందితుడు తాను కుచ్ ప్రాంతంలోని రాపర్‌లో ఆశ్రమం నిర్మిస్తున్నట్లు.. దానికి ఆర్థిక సాయం చేస్తే.. మహోరవాలాకు మేలు కలుగుతుందని నమ్మించాడు. అంతేకాక కుచ్‌లో తనకు ఓ భక్తుడున్నాడని.. అతడి దగ్గర నుంచి మహోరవాలాకు 50 వేల ఎకరాల భూమి తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దాన్ని కంపెనీలకు అమ్ముకుంటే మహోరవాలా కష్టాలు తీరతాయని.. కోట్లు సంపాదించుకోవచ్చని ప్రలోభాలకు గురి చేశాడు. నకిలీ తాంత్రికుడి మాటలు నమ్ముతూ వస్తున్న మహోరవాలా అతడికి కొంత సొమ్ము చెల్లించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నకిలీ తాంత్రికుడు మహోరవాలాకు త్వరలోనే భారీగా ధనం కలిసి వచ్చే అవకాశం ఉందని.. అందుకుగాను ఒక పూజ చేయాలని చెప్పాడు. ఈ క్రమంలో మహోరవాలా నకిలీ తాంత్రికుడి అకౌంట్‌కు 89 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత నిందితుడు మహోరవాలా ఇంటిని శుద్ధి చేయాలని.. అప్పుడు అతడి ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుందన్నాడు. శుద్ధి పేరుతో ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులతో ఉడాయించాడు నకిలీ బాబా. ఈ సందర్భంగా బాధితుడు మహోరవాలా మాట్లాడుతూ.. ‘‘నకిలీ తాంత్రికుడికి అకౌంట్‌కు 89 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను. ఆ తర్వాత శుద్ధి కార్యక్రమం సందర్భంగా అతడికి లక్ష రూపాయలు విలువ చేసే మూడు స్కూటర్లతో పాటు నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఇచ్చాను. కానీ అతడు చెప్పినట్లు డబ్బుల వర్షం కురవలేదు. 2021, మార్చిలో అహ్మదాబాద్‌లో అతడిని చూశాను. నా డబ్బు గురించి అడిగితే.. ‘‘ఇప్పుడు నా ఆర్థికపరిస్థితి ఏం బాగాలేదు.. నీ డబ్బులు ఇవ్వలేనని’’ తెలిపాడు. నా ఫోన్ కాల్స్‌ని కట్ చేస్తున్నాడు. మోసపోయానని గ్రహించి నకిలీ బాబా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలిపాడు. -
‘పాప శరీరంలో దెయ్యం ఉంది’
లక్నో : శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా.. అంతరిక్షంలోకి వెళ్లినా మన సమాజంలో పాతుకుపోయిన కొన్ని ముఢనమ్మకాలను మాత్రం తొలగించలేకపోతున్నాం. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా భూత వైద్యులను, బాబాలను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే పనికిమాలిన సలహాల ప్రకారం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి సంఘటనే ఒకటి షాజహాన్ పూర్లో చోటు చేసుకుంది. నెలల పసికందుకు జబ్బు చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాల్సింది పోయి భూతవైద్యున్ని కలిశారు తల్లిదండ్రులు. అతడు కాస్తా పాప శరీరంలో చెడు ఆత్మ ఉంది. దాని వల్ల మీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని చెప్పాడు. పాపను వదిలించుకోకపోతే ప్రాణ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాడు. దాంతో ఊరి దగ్గర ఉన్న చెరువులో పాపను పడేసేందుకు నిశ్చయించుకున్నాడు కసాయి తండ్రి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ లోపు అక్కడికి చేరుకోవడంతో చిన్నారిని సురక్షితంగా కాపాడారు. అనంతరం పాప తండ్రితో పాటు, మాంత్రికున్ని కూడా అరెస్ట్ చేశారు. -
కూతురిని బలిచ్చేందుకు ప్రయత్నం : తండ్రి అరెస్ట్
గుప్త నిధుల కోసం కన్న కూతురిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన కేరళ మంత్ర వాదితో పాటు నలుగురిని పోలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా పోలాసూర్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణన్. ఇతనికి సొంతమైన వ్యవసాయ భూమి విలాపాక్కం గ్రామంలో ఉంది. లక్ష్మణన్ కోటీశ్వరుడు కావాలని ఆశ పడ్డాడు. దీంతో అప్పడప్పుడు కేరళకు వెళ్లి అక్కడ మంత్రవాదితో మాట్లాడి వచ్చేవాడు. అప్పుడు లక్ష్మణన్ భూమిలో గుప్త నిధులు ఉన్నట్లు వాటిని తీసేందుకు కన్నెపిల్లను గుంతలో పెట్టి పూజలు చేయాలని మంత్రవాది తెలిపాడు. ఇందుకు లక్ష్మణన్ తన పెద్ద కుమార్తెను పెట్టి పూజలు చేసేందుకు అంగీకరించాడు. ఆది వారం రాత్రి 10 గంటలకు విలాపాక్కం లోని లక్ష్మణన్ భూమి వద్ద లక్ష్మణన్ పెద్ద కుమార్తె సుగంధి(16)ని చాపమీద పడుకోబెట్టి పూజలు చేశాడు. కుమార్తెను బలి ఇస్తే తప్పా గుప్త నిధులను తీసేందుకు కుదరదని మంత్రవాది తెలిపాడు. వీఏవో కవిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రవాది కేరళ మంత్రవాది రేగి, భూమి యజమాని లక్ష్మణన్, బంధువులు పేట్టూ గ్రామానికి చెందిన పద్మనాభన్, కణ్ణన్ వీధికి చెందిన మురుగన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.