కూతురిని బలిచ్చేందుకు ప్రయత్నం : తండ్రి అరెస్ట్ | Father arrested by Tamilnadu police | Sakshi
Sakshi News home page

కూతురిని బలిచ్చేందుకు ప్రయత్నం : తండ్రి అరెస్ట్

Jun 25 2014 8:56 AM | Updated on Aug 16 2018 4:21 PM

కూతురిని బలిచ్చేందుకు ప్రయత్నం : తండ్రి అరెస్ట్ - Sakshi

కూతురిని బలిచ్చేందుకు ప్రయత్నం : తండ్రి అరెస్ట్

గుప్త నిధుల కోసం కన్న కూతురిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన కేరళ మంత్ర వాదితో పాటు నలుగురిని పోలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

గుప్త నిధుల కోసం కన్న కూతురిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించిన కేరళ మంత్ర వాదితో పాటు నలుగురిని పోలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా పోలాసూర్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణన్. ఇతనికి సొంతమైన వ్యవసాయ భూమి విలాపాక్కం గ్రామంలో ఉంది. లక్ష్మణన్ కోటీశ్వరుడు కావాలని ఆశ పడ్డాడు. దీంతో అప్పడప్పుడు కేరళకు వెళ్లి అక్కడ మంత్రవాదితో మాట్లాడి వచ్చేవాడు. అప్పుడు లక్ష్మణన్ భూమిలో గుప్త నిధులు ఉన్నట్లు వాటిని తీసేందుకు కన్నెపిల్లను గుంతలో పెట్టి పూజలు చేయాలని మంత్రవాది తెలిపాడు.
 
 ఇందుకు లక్ష్మణన్ తన పెద్ద కుమార్తెను పెట్టి పూజలు చేసేందుకు అంగీకరించాడు.  ఆది వారం రాత్రి 10 గంటలకు విలాపాక్కం లోని లక్ష్మణన్ భూమి వద్ద లక్ష్మణన్ పెద్ద కుమార్తె సుగంధి(16)ని  చాపమీద పడుకోబెట్టి పూజలు చేశాడు. కుమార్తెను బలి ఇస్తే తప్పా గుప్త నిధులను తీసేందుకు కుదరదని మంత్రవాది తెలిపాడు.  వీఏవో కవిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మంత్రవాది  కేరళ మంత్రవాది రేగి, భూమి యజమాని లక్ష్మణన్, బంధువులు పేట్టూ గ్రామానికి చెందిన పద్మనాభన్, కణ్ణన్ వీధికి చెందిన మురుగన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement