వణుకు పుట్టించిన ‘అండర్‌వేర్‌ గ్యాంగ్‌’

Underwear Gang Fears People in Bannerghatta Bangalore - Sakshi

సాక్షి, బెంగళూరు:  ఒంటి నిండా ఆయిల్‌ పూసుకుని, కేవలం అండర్‌వేర్‌ ధరించి... ముఖానికి ముసుగులేసుకున్న గ్యాంగ్‌ నగరంలోకి జనాలకు వణుకుపుట్టించింది. అర్ధరాత్రి చేతిలో ఆయుధాలతో హల్‌ చల్‌ చేస్తూ దోపిడీకి యత్నించగా, ఆ వీడియో వైరల్‌ కావటం కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళ్తే... దక్కన్‌ క్రానికల్‌ కథనం ప్రకారం జూన్‌ 7వ తేదీన అండర్‌ వేర్‌లు ధరించిన ముగ్గురు వ్యక్తులు చేతిలో కత్తులు, కొడవళ్లతో  నగరంలోని బన్నేర్‌ఘట్ట ప్రాంతంలో సంచరించారు. ఇళ్లలోకి చొరబడి దొంగతనానికి యత్నించారు. ఈ క్రమంలో పలు ఇళ్ల బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ధ్వంసం చేసేందుకు శతవిధాల యత్నించారు. ఈ క్రమంలో వాళ్లు విఫలం కాగా, వారి దృశ్యాలు మాత్రం అందులో రికార్డయ్యాయి. 

ఆ తర్వాత ఓ ఇంటి సీసీటీవీ దృశ్యాలు స్థానికంగా వాట్సాప్‌ గ్రూప్‌లలో వైరల్‌ కావటం ప్రారంభించాయి. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ‘అండర్‌వేర్‌ గ్యాంగ్‌’ కోసం గాలింపు చేపట్టారు. ముఠా సభ్యులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు.. త్వరలోనే పట్టుకుంటామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు.  అయితే దొంగలనే అనుమానంతో అమాయకులపై మాత్రం దాడి చేయొద్దని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top