ఇద్దరు యువకుల దుర్మరణం | two youth died in road accident | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువకుల దుర్మరణం

Feb 9 2018 5:07 PM | Updated on Aug 30 2018 4:20 PM

two youth died in road accident - Sakshi

రామకృష్ణ మృతదేహం

బోనకల్‌ : బోనకల్‌లోని వైరా–జగ్గయ్యపేట ప్రధాన రహదారిలోని దర్గా సమీపంలో గురువారం రాత్రి రెండుమోటార్‌ సైకిళ్లు ఢీకొన్నాయి. ఇద్దరు  యువకులు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా వత్సవాయి లో నివాసముంటున్న రాజస్థాన్‌కు చెందిన ముఖేష్‌(25), బోనకల్‌ మండలం చిరునోముల గ్రామంలో పానీపూరీలు అమ్ముకుని బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. కృష్ణాజిల్లా లింగాల కు చెందిన వేముల రామకృష్ణ(30), గోపాలకృష్ణ, వెంకటేష్‌ కలిసి ఒకే బైక్‌పై బోనకల్‌లో సెకండ్‌షో సినిమాకు వస్తున్నారు. దర్గా సమీపంలో ఈ రెండు వాహనాలు ఎదురెదురు గా ఢీకొన్నాయి. ముఖేష్, రామకృష్ణ అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మిగతా ఇద్దరిని 108 సిబ్బంది జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1
1/1

ముఖేష్‌ మృతదేహం

Advertisement
 
Advertisement
Advertisement