ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై టైర్‌ పేలి.. ఇద్దరు మృతి

Two People Died After Vehicle Tire Explodes At ORR Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మేడ్చల్‌ జిల్లా కీసర వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మహేంద్ర మ్యాక్సీ ట్రక్‌ వాహనం టైర్‌ పేలి ఇద్దరు మృతిచెందారు. బుధవారం ఉదయం కూలీలను మ్యాక్సీ ట్రక్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓఆర్‌ఆర్‌పై మ్యాక్సీ ట్రక్‌ వాహనం రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా టైర్‌ పేలిపోయింది. దీంతో ఆ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న కూలీలు రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఒక మహిళ ఘటన స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top