ఇద్దరు రైతుల ఆత్మహత్య

Two farmers suicide - Sakshi

సిరికొండ (నిజామాబాద్‌ రూరల్‌): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేర్వేరుగా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం మైలానికి చెందిన సల్ల మోహన్‌రెడ్డి   మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఆరు బోర్లు వేయగా, ఒక్కదాంట్లోనూ సరిపడా నీళ్లురాలేదు. దీంతో వరి పూర్తిగా ఎండిపోయింది. గల్ఫ్‌ వెళ్లగా, ఏజెంట్‌ మోసంతో నెల రోజులకే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో రూ. 10 లక్షల వరకు అప్పులు అయ్యాయి.

భూమి అమ్మినా అప్పు తీరడం లేదని, ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు ఎలా చేయాలనే ఆందోళనకు గురైన  మోహన్‌రెడ్డి సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అయ్యవారిపల్లికి చెందిన నాగయ్యల రాములు(45) ఉపాధి కోసం దుబాయికి వెళ్లి పని లేక తిరిగి వచ్చాడు.  గల్ఫ్‌ వెళ్లేందుకు, కూతురి పెళ్లి చేసేందుకు అప్పు చేసిన రాములు.. అవి తీర్చే దారి కనిపించక  మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top