బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

Two Engineering Students From AP Dies In Road Accident In Chennai - Sakshi

బస్సు కిందపడి ఇంజనీరింగ్‌ విద్యార్థినుల మృతి

రాజమండ్రికి చెందినవారుగా గుర్తింపు

సాక్షి, చెన్నై : నగరంలోని నందనంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థినులు ప్రాణాలు విడిచారు. వివరాలు.. రాజమండ్రికి చెందిన భవానీ, నాగలక్ష్మీ, శివ ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. మంగళవారం ముగ్గురూ ఒకే బైక్‌పై తాంబారంలోని కాలేజీకి వెళ్తున్న క్రమంలో వెనుకనుంచి మరో బైక్‌ బలంగా ఢీకొట్టింది. బైక్‌తో సహా ముగ్గరూ వెనకే వస్తున్న బస్సు కిందపడిపోయారు. బస్సు చక్రాలకింద నలిగి భవానీ, నాగలక్ష్మీ అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోగా శివకు తీవ్రగాయాలయ్యారు. వీరి బైక్‌ను ఢీకొట్టిన వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. ఇద్దరినీ తాంబారం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. శివ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమీపంలో ఉన్న సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top