ప్రాణాలు తీసిన స్టాపర్‌

Two Died In Road Accident Occured Due To Stopper In Tagarapuvalasa - Sakshi

సాక్షి, తగరపువలస(విజయనగరం) : వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్టాపర్‌ను బైక్‌తో ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన భీమిలి మండలం దాకమర్రి సమీపంలో విజయనగరం వెళ్లే రోడ్డులో ఆదివారం అర్థరాత్రి జరిగింది. భీమిలి ఎస్‌ఐ పాణిగ్రాహి తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా సాలూరు చింతల వీధికి చెందిన తిరుమలేశ(21), బాడాన హేమంత్‌ కుమార్‌(30) ఆదివారం ఉదయం విశాఖపట్నం ద్విచక్ర వాననంపై వచ్చా రు. తిరిగి ఆదివారం అర్ధరాత్రి తిరుగుప్రయాణమయ్యారు.

విజయనగరం పట్టణంలోని ఉడాకాలనీలో ఉంటున్న తిరుమలేశ అమ్మమ్మ ఇంటి వద్ద రాత్రికి ఉండిపోయి తెల్లవారి స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో రాత్రి 1:50 గంటల సమయంలో దాకమర్రి రఘు కళాశాల వద్ద వేగ నియంత్రణ కోసం రోడ్డుపై ఏర్పాటు చేసిన స్టాపర్‌ను బైక్‌తో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తిరుమలేశ సంఘటన స్థలంలోనే మరణించంగా, తీవ్రంగా గాయపడిన హేమంత కుమార్‌ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సింహగిరి ప్రదక్షిణ బందోబస్తులో ఉండటంతో విషయం అలస్యంగా తెలిసింది. భీమిలి ఎస్‌ఐ పాణిగ్రాహి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top