గిరిజనుడి దారుణ హత్య | Tribal Man Murdered in Visakhapatnam | Sakshi
Sakshi News home page

గిరిజనుడి దారుణ హత్య

Dec 14 2018 7:39 AM | Updated on Jan 3 2019 12:14 PM

Tribal Man Murdered in Visakhapatnam - Sakshi

రంగారావు మృతదేహం

డుంబ్రిగుడ(అరకులోయ):  కల్లు దుకాణం వద్ద జరిగిన చిన్నపాటి ఘర్షణ హత్యకు దారితీసింది. మండలంలోని కొర్రా పంచాయతీ పెద్దపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రంగారావు(55) అనే వ్యక్తిని అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ కాకరపాడు గ్రామానికి చెందిన బూర్జ రాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. డుంబ్రిగుడ ఎస్‌ఐ హిమగిరి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపాడు గ్రామానికి చెందిన  రంగారావు డీఆర్‌డీపో డీలర్‌గా చేసేవాడు.  కించుమండ సంతబయలు వద్ద జీలుగు  కల్లు విషయంలో బుధవారం చిన్నపాటి ఘర్షణ జరిగింది. బూర్జ రాజు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండగా, డబ్బులు ఇచ్చి వెళ్లు  అన్ని రంగారావు చెప్పాడు.

అయితే  నువ్వెందుకు  డబ్బులు అడుగుతున్నావు అంటూ ఆగ్రహించిన రాజు.. రంగారావుతో  ఘర్షణకు దిగి, కత్తితో బలంగా కడుపులో పొడిచాడు.  రంగారావు పడిపోవడం గమనించిన స్థానికులు,కుటుంబ సభ్యులు హుటాహుటిన అరకులోయ ఏరియా ఆస్పత్రికి  తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో రంగారావు మృతి చెందాడు. మృతదేహాన్ని అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.  కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు.  అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. మృతునికి భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement