మావోల దుశ్చర్య

Trees on the railway track - Sakshi

రైలు ట్రాక్‌కు అడ్డంగా నరికి పడేసిన చెట్లు

దంతెవాడ ప్రాంతంలో ఘటన

విశాఖపట్నం–కిరండోల్‌ మధ్య నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

మల్కన్‌గిరి/జయపురం ఒరిస్సా : విశాఖపట్నం నుంచి కిరండోల్‌ వెళ్లే రైలు మార్గంలో దంతెవాడ ప్రాంతంలో కొరాపుట్‌–కిరండోల్‌ రైలు ట్రాక్‌పై అడ్డంగా మావోయిస్టులు చెట్లు నరికి వేశారు. ఆదివారం రాత్రి ఈ చెట్లను నరికి ట్రాక్‌పై వేసి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. అలాగే ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో రైలు ట్రాక్‌ వద్ద సిబ్బంది నుంచి మావోయిస్టులు వాకీటాకీలు తీసుకుపోయినట్టు తెలిసింది. అయితే సోమవారం సాయంత్రం వరకు ఈ చెట్లను తొలగించలేదు.

దీంతో విశాఖపట్నం నుంచి కిరండోల్‌ వైపు, జగదల్‌పూర్‌ వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవానులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని యుద్ధప్రాతిపదిన చెట్లను తొలగించారు. ముందు బాంబు స్క్వాడ్‌ వచ్చి బాంబులు ఉన్నాయేమోనని పరిశీలించారు. బాంబులు లేవని నిర్ధారించుకున్న తర్వా త  చెట్లును తొలగించటంతో ఆ మార్గం లో యథాతధంగా రైళ్లు నడిచినట్టు సమాచారం. ఈ సంఘటనతో ఈ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ జవానులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. 

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top