ఏకంగా జడ్జీ సీటులో కూర్చొని.. అడ్డంగా బుక్కయ్యాడు! | Trainee Police Clicked Selfies Sat On Judge Chair In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

సెల్ఫీలపై మోజు.. ట్రైనీ పోలీస్‌ అరెస్ట్‌

Jul 2 2018 3:55 PM | Updated on Oct 8 2018 3:19 PM

Trainee Police Clicked Selfies Sat On Judge Chair In Madhya Pradesh - Sakshi

మధ్యప్రదేశ్‌లోని ఉమారియా పోలీస్‌ స్టేషన్‌

భోపాల్‌ : సెల్ఫీలపై మోహంతో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నా.. జనాల్లో మార్పు రావడం లేదు. సమయం, సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకుంటూ.. ఇతరులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. వారు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా న్యాయమూర్తి కుర్చీలో కూర్చొని సెల్ఫీలు దిగిన ట్రైనీ కానిస్టేబుల్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రామ్‌ అవతార్‌ రావత్‌ అనే వ్యక్తి ఉమారియా పోలీస్‌ అకాడమీలో ట్రైనీగా ఉన్నాడు. శనివారం రోజు జిల్లా కోర్టుకు వెళ్లిన రావత్‌.. కోర్టు ప్రాగణంలోని న్యాయమూర్తి గది తెరచి ఉండటంతో అందులోకి వెళ్లాడు. న్యాయమూర్తి సీటులో కూర్చొని సెల్ఫీలు దిగసాగాడు. రావత్‌ సెల్ఫీలు దిగడాన్ని గమనించిన గుమస్తా శక్తిసింగ్‌ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కొత్వాలి పోలీసులు రావత్‌పై కేసు నమోదు చేశారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement