ఉలిక్కిపడ్డ ఉల్లంపర్రు | three members dead in hyderabad west godavari local people | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడ్డ ఉల్లంపర్రు

Jan 30 2018 1:26 PM | Updated on Sep 4 2018 5:37 PM

పాలకొల్లు అర్బన్‌: హైదరాబాద్‌లో ముగ్గు రు హత్యకు గురైన సంఘటన  పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో తీవ్ర సంచలనాని కి దారితీసింది. ఉల్లంపర్రు గ్రామానికి చెం దిన అపర్ణతోపాటు ఆమె నాలుగేళ్ల కుమార్తె, అపర్ణ తల్లి హత్యకు గురయ్యారు. వీరు హత్యకు గురైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉల్లంపర్రులో విషాదఛా యలు అలముకున్నాయి. ఈ ముగ్గురిని హ త్య చేసిన ఇదే గ్రామానికి చెందిన రావాడ మధు ఇరవై ఏళ్ల నుంచి భార్య, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు.

సెల్‌ రిపేరింగ్‌ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. అపర్ణతో సెల్‌షాపులో పరి చయం కావడం, ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఆ పరిచయం కాస్తా వివాహేతర సం బంధానికి దారితీసింది. అయితే వీరిద్దరి మధ్య ఏ మనస్పర్థలు తలెత్తాయో తెలి యదు కాని ముగ్గురిని మధు హత్య చేసి పరారయ్యాడు. అపర్ణ అద్దెకుంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫోన్‌ చేయడంతో హత్య సంఘటన బయటపడింది. ప్రస్తుతం మధు పోలీ సుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అప ర్ణ ఫ్యాన్సీ షాపులో సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తూ తల్లీ, కూతుళ్లను పోషించుకుంటుంది. çహంతకుడు, బాధితులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో అలజడి రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement