నివురుగప్పిన నిర్లక్ష్యం.. ముగ్గురు చిన్నారుల బలి

Three Children Died After Drown In Tank In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం ముగ్గురు చిన్నారులను బలితీసుకుంది. ఇళ్ల సమీపంలోగల నీటి గుంతల వద్దకు బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ఒకరిని రక్షించబోయి మరొకరు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులు నివర్ద్‌ కాంబ్లీ, కృష్ణ, సందీప్ సుభాష్‌ల కుటుంబాలు మహారాష్ట్ర నుంచి 10 ఏళ్ల కిందట హనుమాన్‌నగర్‌ కాలనీకి వలసవచ్చాయి.

రోజూ కూలీ చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న తమ కుటుంబాల్లో అక్రమ మట్టి తవ్వకాలు చిచ్చురేపాయని చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మట్టిని తవ్వుకున్న అనంతరం గుంతల్ని పూడ్చకుండా వదిలివేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top