నల్గొండ ఎస్‌బీఐ బ్యాంకులో చోరీకి యత్నం | Thieves Robbery Attempt In Nalgonda SBI Bank | Sakshi
Sakshi News home page

నల్గొండ ఎస్‌బీఐ బ్యాంకులో చోరీకి యత్నం

Oct 28 2019 12:27 PM | Updated on Oct 28 2019 4:08 PM

Thieves Robbery Attempt In Nalgonda SBI Bank - Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లా కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి ప్రయత్నించారు. బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించిన దుండగులు చివరికి విఫలమయ్యారు.  సోమవారం ఉదయం బ్యాంకులో  చోరీకి యత్నించినట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా బ్యాంకులో ఎటువంటి నగదు మాయం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement