చిన్నారిని చిదిమేసిన ‘హై హీల్స్‌’ | In Thane 6 Months Child Died Because Of High Heels | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన ‘హై హీల్స్‌’

May 8 2018 10:16 AM | Updated on Oct 8 2018 5:45 PM

In Thane 6 Months Child Died Because Of High Heels - Sakshi

థానే : కాస్తా ఎత్తుగా, మరికాస్తా అందంగా కనిపించడానికి ధరించిన హై హీల్స్‌(చెప్పులు) మహారాష్ట్రలో ఓ పసిప్రాణాన్ని బలితీసుకున్నాయి. వినాడానికి షాకింగ్‌ ఉన్న ఇది నిజం. వివాహ వేడుకకు కోసం ఓ మహిళ ధరించిన హై హిల్స్‌ కాస్తా పట్టు తప్పడంతో చేతిలో ఉన్న ఆరు నెలల చిన్నారి బిల్డింగ్‌ మొదటి అంతస్తు నుంచి కిందపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఫెహ్మిద షేక్‌ (23) తన 6 నెలల కుమారుడు మహ్మద్‌ను తీసుకుని భర్తతో కలిసి రాంభాగ్‌లో జరుగుతున్న బంధువుల వివాహ వేడుకకు హజరయ్యింది. వివాహం ముగిసిన అనంతరం ఇంటికి వెళ్దామని బయలుదేరారు.

మొదటి అంతస్తులో బాల్కని వెంబడి కిందకు వస్తున్నారు. ఆ సమయంలో ఫెహ్మిదా ధరించిన హై హీల్స్‌ కాస్తా పట్టు తప్పడంతో ఆమె చేతిలో ఉన్న 6 నెలల మహ్మద్‌ మొదటి అంతస్తు నుంచి జారి కిందపడ్డాడు. ఫెహ్మిద భర్తతో కలిసి కిందకు పరిగెత్తే చూసే సరికి పసివాడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మహ్మద్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మహ్మద్‌ మృతిని ప్రమాదం వల్ల జరిగినట్లు నమోదు చేసుకున్నారు. అంతేకాక తదుపరి విచారణకు ఆదేశించినట్లు మహాత్మ ఫౌలే పోలీసు స్టేషన్‌ అధికారి విజయ్‌ ఖేడేకర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement