విద్యార్థిపై అధ్యాపకుల దాష్టీకం

Teachers Attack On Intermediate Student Mahabubnagar - Sakshi

నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌: ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి వ్యవహార శైలి బాగోలేదని సాకు చూపుతూ సంబంధిత తరగతి అధ్యాపకుడు దాష్టీకం ప్రదర్శించాడు. తనను దుర్భాషలాడాడని విచక్షణ కోల్పోయి చితకబాదడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన శనివారం జిల్లాకేంద్రంలోని గీతాంజలి ప్రైవేటు కళాశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ మండలం కుమ్మెర గ్రామానికి చెందిన హన్మాండ్ల శివయ్య, కృష్ణవేణి దంపతుల ఆదిత్య(18) స్థానిక గీతాంజలి ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజులాగే శనివారం తరగతులు నిర్వహించిన అధ్యాపకుడు తన క్లాస్‌ అయిపోయిన తర్వాత అధ్యాపకుడిని సదరు విద్యార్థి దుర్భాషలాడటంతో అది విన్న అధ్యాపకుడు తనను ఈడ్చుకెళ్లి చితకబాదాడు. వెంటనే కళాశాల యాజమాన్యానికి తెలపడంతో మరో ముగ్గురు కలిసి చావబాదాడని ఆరోపించారు.

ఆస్పత్రికి తరలించిన అనంతరం సమాచారం అందించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆస్పత్రికి చేరుకున్న ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి వారి వివరాలు సేకరించారు. విద్యార్థి పరిస్థితిపై వైద్యుడిని వివరణ కోరగా కుడి కాలి తొడ ఎముక క్రాక్‌ వచ్చిందన్నారు. ఇదిలా ఉండలా కళాశాల యాజమాన్యాన్ని వివరణ  కోరగా విద్యార్థిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. సెలవు రోజు అయినప్పటికీ కళాశాల నడపడంపై జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ ఆఫీసర్‌ వెంకటరమణ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థిని కొట్టడానికి గల కారణాలను అడిగారు. దీనిపై సంబంధిత తరగతి గది అధ్యాపకుడు నీళ్లు నమలడంతో కళాశాలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

నలుగురిపై కేసు నమోదు  
నాగర్‌కర్నూల్‌ క్రైం: ఆదిత్యను కొట్టిన ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కళాశాల డైరెక్టర్‌ సునేంద్ర, అధ్యాపకులు లక్ష్మణాచారి, రమేష్, నవీన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం విద్యార్థి ఆదిత్యను జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం  తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top