పాలమూరు జైలులో స్వాతిరెడ్డి

Swathi reddy Transfer to Palamuru jail From Nagarkurnool - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: సరిగ్గా రెండేళ్ల తర్వాత స్వాతిరెడ్డి పేరు మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. ఈ కేసులో రెండేళ్ల కిందట ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతంగా హత్య చేయడంతో అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. భర్తను హత్య చేసినందుకు స్వాతిరెడ్డికి అప్పట్లో కోర్టు జైలు శిక్ష విధించింది. అనంతరం బెయిల్‌పై స్వాతిని 2018 జూలై 27న విడుదల చేశారు. అయితే, ఆమెను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని జైలు నుంచి నేరుగా పట్టణంలోని మెట్టుగడ్డ దగ్గర ఉన్న రాష్ట్ర సదనంకు తరలించారు.

అయితే ఈ కేసులో నాగర్‌కర్నూల్‌ జిల్లా కోర్టుకు వాయిదాల కోసం వెళ్లాల్సి ఉండగా మూడు సార్లు ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి స్వాతిరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో నాగర్‌కర్నూల్‌ పోలీసులు ఆమెను మంగళవారం అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆమె జైలులో 14రోజుల పాటు శిక్ష అనుభవించనుంది. ఇదిలాఉండగా, స్టేట్‌హోం నుంచి నాగర్‌కర్నూల్‌ కోర్టుకు వెళ్లడానికి సరైన భద్రత, స్థానిక సిబ్బంది నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే ఆమె కోర్టుకు హాజరుకాకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top