రూమ్‌ బాయ్‌పై సురభి హోటల్‌ యజమాని దాడి

Surabhi Restaurant Owner Ravi Attacks On Room Boy In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : లాడ్జిలో రూమ్‌ బాయ్‌గా పనిచేస్తున్న ఓ యువకునిపై సురభి గ్రూప్స్ యజమాని రవి కిరాతంగా ప్రవర్తించాడు. రూమ్‌ సరిగా శుభ్రం చేయడం లేదనే కారణంగా పిడిగుద్దులు గుద్దుతూ.. కాలితో విచక్షణారహితంగా తన్నాడు. గొంతు పిసుకుతూ దాడి చేశాడు. దీంతో యువకుడు (17) దారుణంగా గాయపడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు రూమ్‌లోని సీసీటీవీలో నమోదయ్యాయి. కాగా, ఏదైనా తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలిగాని ఇంతలా దాడి చేస్తారా అని ఈ వీడియో చూసిన వారు నివ్వెర పోతున్నారు. సురభి గ్రాండ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌, సురభి బిర్యాని హౌజ్‌, సురభి రెస్టారెంట్‌, సురభి డీలక్స్‌ లాడ్జి, సురభి రాయల్‌ రెసిడెన్సీ, సురభి క్యాటరర్స్‌కు రవి యజమాని. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top