చేపల మార్కెట్‌లో ఆత్మాహుతి దాడి

Suicide Bombers kills Civilians in Eastern Nigeria - Sakshi

అబుజా : ఆత్మాహుతి దాడితో నైజీరియాలో రక్తపాతం చోటు చేసుకుంది. ఈశాన్య ప్రాంత పట్టణం మైడుగురిలోని ఓ చేపల మార్కెట్‌లో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ మారణ హోమంలో 18 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు సమాచారం.

శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బాంబు దాడి చోటు చేసుకున్నట్లు బోర్నో పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.  18 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు.

2015లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ సైనిక పాలకుడు ముహమ్మదు బుహారీ.. ఇస్లాం ఉగ్రవాద సంస్థ బోకో హరామ్‌ను కట్టడి చేస్తానని.. పౌరులకు రక్షణ కల్పిస్తానని ప్రకటించాడు. అయినప్పటికీ ఉగ్రదాడులను కట్టడి చేయలేకపోయాడు. ఐసిస్‌ తో విలీనం అయ్యాక ఆ సంస్థ దాడులను మరింతగా ఉధృతం చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top