వ్యభిచారం నిర్వహిస్తున్నావంటూ.. | Sudo Police arrested in hyderabad | Sakshi
Sakshi News home page

వ్యభిచారం నిర్వహిస్తున్నావంటూ..

Oct 20 2017 1:27 PM | Updated on Sep 4 2018 5:07 PM

టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ఓ వ్యక్తి ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ఓ వ్యక్తి ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసుల ముఠాని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ సందీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నావు అంటూ బాధితుడిని సూడో పోలీసుల ముఠా బెదిరించిందని తెలిపారు. బాధితుడు గ్రంధి శివానంద స్వామిని రూ. లక్ష డిమాండ్ చేసి 88 వేల రూపాయలు వసూలు చేశారని తెలిపారు.

ఈ ముఠాకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిందితుల్లో హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాయి కుమార్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ఒక తుపాకీ , రూ. 63 వేల నగదు, ఒక పోలీస్ యూనిఫామ్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement