విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడని..

Students Attacks NCC Teacher In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఎన్‌సీసీ మాస్టర్‌పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీహరి అనే నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఎన్‌సీసీ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే శ్రీహరి ఓ విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడని ఆరోపిస్తూ శ్రీకాంత్‌ అనే విద్యార్థి సహచర విద్యార్థులతో కలిసి అతడిని చితకబాదాడు. దీంతో శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top