
మదనపల్లె టౌన్ :కుటుంబ సభ్యులు గొడవ పడడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని పాఠశాలలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం మేరకు.. పాళెంకొండ గుండావారిపల్లెకు చెందిన లక్ష్మిదేవి, రమణయ్య దంపతుల కుమార్తె రేవతి(14) కొత్తవారిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులు గొడవ పడడంతో మనస్తాపం చెందిన ఆమె సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చింది. అక్కడ పురుగుల మందు తాగింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులకు, 108కు సమాచారం అందించారు. వారు బాలికను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన చికిత్స అందించడంతో కోలుకుంటోంది. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.