అనుమానం వస్తే ప్రశ్నించండి

SP Anuradha cordon search In Palamur - Sakshi

పాలమూరులో కార్డెన్‌ సెర్చ్‌

టీడీగుట్ట, ఖలీల్‌చౌక్‌లోని 300 ఇళ్లలో తనిఖీలు

14 బైక్‌లు, 7 ఆటోలు,   ఒక కారు స్వాధీనం

ఎనిమిది మంది అనుమానితుల అరెస్ట్‌

తనిఖీల్లో పాల్గొన్న   ఎస్పీ అనురాధ

మహబూబ్‌నగర్‌ క్రైం: మీ ప్రాంతంలో కొత్తగా.. అనుమానితులుగా ఎవరైనా వ్యక్తులు గాని, మహిళలు కనిపిస్తే ఒక కాలనీ చెందిన వ్యక్తులుగా ముందు మీరే వాళ్లను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించాలని.. పొంతన లేని సమాధానాలు చెబితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహబూబ్‌నగర్‌ ఎస్పీ అనురాధ స్థానిక ప్రజలకు సూచించారు. కార్డెన్‌ సెర్చ్‌లో జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని టీడీగట్టు, ఖలీల్‌చౌక్‌ ప్రాంతాల్లోని 300 ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా ఇంట్లో నివాసం ఉండే వ్యక్తుల వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఇళ్లను పరిశీలిస్తూ వారి ఇంట్లో ఎవరు ఉంటున్నారు.. వాళ్ల జీవన విధానం ఇతర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా కాలనీలో ఉండే కిరాణం, పాన్‌ దుకాణాలను ఎస్పీ పరిశీలించి వాటిలో అమ్ముతున్న సరుకులను తనిఖీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాగిన తనిఖీల్లో 14 ద్విచక్రవాహనాలను, 7 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకుని.. 8 మంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భం గా అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. తనిఖీల్లో అద నపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, ఐదు మంది సీఐలు, 10 మంది ఎస్‌ఐలతోపాటు 200 మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ ప్రతి వారానికి ఒకసారి పట్టణంలో ఒ క కాలనీలో తనిఖీలు చేపడుతామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top