క్షణికావేశం..ఓ ప్రాణం తీసింది! | Son Killed Father in Assets Conflicts Anantapur | Sakshi
Sakshi News home page

క్షణికావేశం..ఓ ప్రాణం తీసింది!

Jan 18 2019 12:27 PM | Updated on Jan 18 2019 12:27 PM

Son Killed Father in Assets Conflicts Anantapur - Sakshi

అనంతపురం, నార్పల: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆస్తి విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ ఏకంగా ఓ తండ్రి ప్రాణాన్నే బలిగొంది. ఈసంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..మండల కేంద్రంలోని ఉయ్యాలకుంటలో నివాసముంటున్న తిరుపతయ్య(58)కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు రాజకుళ్లాయప్ప ఉన్నారు. గురువారం రాత్రి ఆస్తి విషయమై తిరుపతయ్యకు కుమారుడి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. మాటామాట పెరిగి కుమారుడు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు.

ఈక్రమంలో పక్కనే ఉన్న రాయిని తండ్రిపై విసిరాడు. రాయి నేరుగా తలను తాకడంతో తీవ్ర రక్తస్రావమై తిరుపతయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ పుల్లయ్య ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement