మరదలిని పెళ్లి చేసుకున్నట్లు పోస్టులు

SI Arrest In Fake Photos Upoloading In Social Media - Sakshi

ఎస్‌ఐ అరెస్ట్‌

టీ.నగర్‌: మరదలిని వివాహం చేసుకున్నట్లు ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పోస్టు చేసిన ఎస్‌ఐను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. ఈరోడ్‌ జిల్లా అందియూర్‌ సమీపం అప్పకూడల్‌కుళియంగూరు ప్రాంతానికి చెం దిన వెంకటాచలం (43) గోబిచెట్టిపాళయం ప్రొహిబిషన్‌ శాఖలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. జూన్‌ 13న తన భార్య చెల్లెలు (చిన్నాన్న కుమార్తె) దివ్వభారతి (23)ని వివాహం చేసుకునేందుకు కిడ్నాప్‌ చేశాడు.

దీనిపై దివ్యభారతి తండ్రి వేలుస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తేని జిల్లా, దేవదానపట్టి ప్రాంతంలో దివ్యభారతిని పోలీసులు రక్షించారు. దీంతో వెంకటాచలాన్ని డీఐజీ కార్తికేయన్‌ జూన్‌ 23న సస్పెండ్‌ చేశారు. ఇలా ఉండగా గురువారం దివ్యభారతిని వివాహం చేసుకున్నట్లు వెంకటాచలం ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో పోస్టు చేశాడు. దీన్ని గమనించి దిగ్భ్రాంతి చెందిన దివ్యభారతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం వెంకటాచలాన్ని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాచలంపై 420, 506 (02) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలులో నిర్బంధించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top