బాలికపై మైనర్‌ లైంగిక దాడి

Sexual Assault On A Child By Relative In Vikarabad - Sakshi

వరుసకు సోదరిపైనే బాలుడి అకృత్యం..

సాక్షి, కందుకూరు: బాలికపై మైనర్‌ బాలుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిప్పలపల్లిలో 8 ఏళ్ల వయస్సు గల బాలికను శుక్రవారం ఒంటరిగా ఇంటి వద్ద వదిలి తల్లి పొలం పనులకు, తండ్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు.

కాగా తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తల్లి ఇంటికి రాగా తలుపులు సగం తెరిచి ఉండడం గుర్తించి ఇంట్లోకి వెళ్లి చూడగా తన కుమారైపై వారి బంధువు, వరుసకు ఆ బాలికకు అన్న అయ్యే మైనర్‌ బాలుడు(16) లైంగిక దాడి చేస్తూ కనిపించాడు. ఆమెను చూడగానే వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top