ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి | Several Died And Injured Due To Collapsed Tent In Barmer | Sakshi
Sakshi News home page

ఘోరం: టెంట్‌కూలి 14 మంది మృతి

Jun 23 2019 6:05 PM | Updated on Jun 23 2019 9:25 PM

Several Died And Injured Due To Collapsed Tent In Barmer - Sakshi

జైపూర్‌‌: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్‌మీర్‌ జిల్లాలో  టెంట్‌ (గుడారాలు) కూలి 14 మంది మృతిచెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం తరలివచ్చిన భక్తుల కోసం  అక్కడ పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో గాలి, భారీ వర్షం సంభవించడంతో  అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే పలువురు భక్తులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో మరికొంతమంది మరణించినట్లు సమాచారం. ఘటన జరగిన సమయంలో దాదాపు వెయ్యి మంది భక్తులు ఉన్నట్లు తెలస్తోంది.  గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. 

ప్రధాని మోడీ దిగ్ర్బాంతి
బార్‌మీట్‌ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాకు అండగా ఉంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement