యువతిని మోసం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు | Seven Years Jail in Sexual Case | Sakshi
Sakshi News home page

యువతిని మోసం చేసిన వ్యక్తికి ఏడేళ్ల జైలు

May 2 2018 12:19 PM | Updated on Oct 9 2018 5:43 PM

Seven Years Jail in Sexual Case - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రంగారెడ్డి జిల్లా కోర్టులు : ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 7 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ. 2500 జరిమానా విధిస్తూ 2వ స్పెషల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు ఇన్‌చార్జి జడ్జీ మంగళవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీరాంరెడ్డి కథనం ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన యువతికి 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహానంతరం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది.

మహేశ్వరంలో టైలరింగ్‌ పనిచేస్తూ జీవనాన్ని గడుపుతోంది. అదే గ్రామానికి చెందిన మహ్మద్‌ హజీం ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఆ యువతికి పరిచయం అయ్యాడు. ఆ యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను శారీరకంగా అనుభవించాడు. 2013 జూన్, 6 పెళ్లి చేసుకోమంటూ హజీంను కోరగా అతను తిరస్కరించాడు.

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 14వ అదనపు డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జీ వరప్రసాద్‌ పైవిధంగా తీర్పు చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement