
అసహజ శృంగారంలో పాల్గొనాలని అనుచరులపై..
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో బురిడీ బాబా గుట్టు రట్టైంది. అతీంద్రియ శక్తులు సమకూరేందుకు అసహజ శృంగారంలో పాల్గొనాలని తన అనుచరులను ప్రేరేపించిన వివాదాస్పద స్వామీజీని పర్బానీ పోలీసులు అరెస్ట్ చేశారు. శిష్యులను అసహజ శృంగారంలో పాల్గొనాలని బాబా అసిఫ్ నూరి బలవంతపెడుతున్న వీడియోలను స్ధానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
నూరిని పొరుగున ఉన్న బుల్ధానా జిల్లాలో అరెస్ట్ చేశామని పర్బానీ ఎస్పీ దిలీప్ జలాకే తెలిపారు. నిందితుడు కొత్తగా పెళ్లయిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి సమస్యలు తీరుస్తానని నమ్మబలుకుతాడని అనంతరం వారిని గదిలోకి తీసుకువెళ్లి ఒకరితో ఒకరు అసహజ పద్ధతుల్లో శృంగార కార్యకలాపాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తాడని చెప్పారు. అసహజ శృంగారాన్ని నిషేధించే ఐపీసీ సెక్షన్ నిబంధనలపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.